Friday, May 10, 2024

మా మెడల్స్ గంగానదిలో విసిరేస్తాం

spot_img

దేశం కోసం తాము సాధించిన పతకాలను కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గంగా నదిలో విసిరేస్తామని భారత రెజ్లర్లు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం గం.6.00లకు హరిద్వార్‌లోని గంగానదిలో పతకాలను నిమజ్జనం చేస్తామని తెలుపుతూ.. ఓ భావోద్వేగ లేఖను విడుదల చేశారు.

ఈ నెల 28న జరిగిన పరిణామాలను లేఖలో రెజ్లర్లు ప్రస్తావించారు. ‘పతకం మా ప్రాణం, మా ఆత్మ. త్వరలోనే ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఇండియా గేట్ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మన అమరవీరుల ప్రదేశం. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు మా భావాలు కూడా ఆ సైనికుల మాదిరిగానే ఉన్నాయి.

ఈ నెల 28న పోలీసులు మాతో ఎలా ప్రవర్తించారు? మమ్మల్ని ఎంత క్రూరంగా అరెస్టు చేశారో సమాజం చూసింది. మరుసటి రోజు తీవ్రమైన కేసులలో మాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. తమపై జరిగిన లైంగిక వేధింపులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా రెజ్లర్లు అడగడం తప్పా? వాళ్లు ఏదైనా నేరం చేశారా? లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి బహిరంగంగా మాపై విమర్శలు చేస్తుంటే… పోలీసులు, వ్యవస్థ మమ్మల్ని నేరస్థుల్లా చూస్తున్నాయి’ అని రెజ్లర్లు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

Latest News

More Articles