Monday, May 13, 2024

ఎయిర్‌ఫోర్స్‌ విమానం కూలి.. బాలిక మృతి

spot_img

ఇటలీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఒక విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలిక మరణించగా.. 9 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Also Read.. బంగారు తెలంగాణ సాధనకు సమైక్యంగా కృషి చేద్దాం

వివరాల్లోకి వెళితే.. ఇటలీలోని టురిన్‌లో ఎయిర్‌ఫోర్స్‌ డే విన్యాసాల కోసం రిహార్సిల్స్‌ చేస్తుండగా… ఒక యుద్ధ విమానం కూలిపోయింది. ఆ విమాన పైలట్‌ పారాచూట్‌ సహాయంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

Also Read.. థర్డ్ ఫ్రంట్ కి దళపతిగా కేసీఆర్..!

కాగా, యుద్ధ విమానం కూలిన ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది. దీంతో ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలిక మరణించగా.. ఆమె సోదరుడైన తొమ్మిదేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబానికి ఇటలీ ప్రధానమంత్రి, రక్షణ మంత్రి సంతాపం తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Latest News

More Articles