Saturday, May 18, 2024

కేసీఆర్ పాలనలో వృద్ధులు ఆత్మగౌరవంతో బతుకుతున్నరు

spot_img

సిద్దిపేట జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వృద్దులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.తమ పెద్దకొడుకు కేసీఆర్ ఉండగా మాకు డోకా లేదని ముసలోళ్ళు సంతోషపడుతున్నారు.  పింఛన్ తో కోడలు అత్తను మంచిగా చూసుకుంటున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా శివం గార్డెన్స్ లో నూతన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు పింఛను ఉత్తర్వులను పంపిణీ చేసి అనంతరం మాట్లాడారు.

Also Read.. పాలమూరు వాసుల కల నెరవేరింది.. మహా శివునికి కృష్ణా జలాలతో జలాభిషేకం

కేసీఆర్ చక్కటి ఆసుపత్రులను పెట్టి మంచి వైద్యం అందిస్తున్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో 2000 పింఛన్ ఇవ్వడం లేదు. దివ్యంగుల కు 4000 ఎక్కడ లేదు.  ఒక్క తెలంగాణలో మాత్రమే ఇస్తున్నాం.  దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా బీడీ కార్మికులకు, టేకేదార్లకు పింఛను ఇస్తున్నాము. ప్యాకర్లకు కూడా ఇస్తాము.  నేత, గీతా, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఎవరైనా మిగిలి ఉంటే వాళ్లందరికీ అందరికీ పింఛన్ ఇస్తామమని హరీశ్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 43 లక్షమంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారని, వారికి నెలకు 1000 కోట్ల రూపాయల పింఛను అందుతుందన్నారు.

Also Read.. స్వచ్ఛ సర్వేక్షన్ లో నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామ పంచాయతీ ఎంపిక

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పీడీ డిఆర్డిఓ తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles