Friday, May 17, 2024

జార్ఖండ్‌లో పానీపూరీ తిని.. 50 మందికి అస్వస్థత

spot_img

రాంచీ: జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో పానీపూరీ తిన్న 40 మంది పిల్లలు, 10 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం లోకై పంచాయతీ పరిధిలోని గోసైన్ తోలా ప్రాంతంలో వీధి వ్యాపారి అమ్మే పానీపూరీలను పిల్లలు, మహిళలు తిన్నారు. అనంతరం వారంతా వాంతులు, విరోచనాలతో అనారోగ్యం పాలయ్యారు.

Also Read.. కేటీఆర్ సూటి ప్రశ్న.. మీరు ఏ హోదాలో హామీలిస్తున్నారు రాహుల్

ఈ నేపథ్యంలో సుమారు 40 మంది పిల్లలు, పది మంది మహిళలను కోడెర్మాలోని సదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, కలుషిత ఆహారం తినడం వల్ల వారంతా అస్వస్థత చెందినట్లు ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. మరోవైపు ఆ వీధి వ్యాపారి నుంచి ఫుడ్‌ శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్ కు పంపినట్లు అధికారులు తెలిపారు.

Latest News

More Articles