Saturday, May 18, 2024

క్లాస్‎రూంలో టీచర్‌పై కాల్పులు జరిపిన ఆరేండ్ల కుర్రాడు

spot_img

చిన్న పిల్లలు ముద్దుముద్దు మాటలతో ఆడుతూపాడుతూ ఉంటే అందరికీ నచ్చుతుంది. తెలిసీతెలియని అమాయకత్వంతో కొన్ని అల్లరి పనులు చేస్తుంటారు. కానీ ఓ ఆరేండ్ల పిల్లాడు మాత్రం స్కూల్‎కి గన్ తీసుకొచ్చాడు. అంతేనా.. టీచర్ ఏదో అనిందని ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అమెరికాలోని వర్జీనియాలో శుక్రవారం జరిగింది.

రిచ్‌నెక్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుతున్న ఆరేండ్ల కుర్రాడు స్కూల్‎కు గన్ తీసుకొచ్చాడు. టీచర్ పాఠాలు చెబుతున్నప్పుడు ఆ విద్యార్థి అల్లరి చేశాడు. దాంతో టీచర్ మందలించింది. కాసేపు ఇద్దరి మధ్యా వాదన జరిగింది. అనంతరం ఆ చిన్నారి గన్ తీసి తరగతి గదిలోనే టీచర్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నదని స్థానిక పోలీస్‌ చీఫ్‌ స్టీవ్‌ డ్రూ చెప్పారు. విద్యుర్థులకు ఎలాంటి హానీ జరగలేదన్నారు. నిందితుడైన ఆరేండ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అయితే ఈ కాల్పులు ప్రమాదవషాత్తు జరిగిందేమీ కాదని, ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పారు.

Latest News

More Articles