Friday, May 3, 2024

ఐటీ కంపెనీల్లో 64వేల మంది ఉద్యోగులు ఔట్.!

spot_img

దేశీయ టాప్ ఐటీ రంగ సంస్థల్లో ఉద్యోగులు భారీగా తగ్గుతున్నారు. గత ఆర్థిక ఏడాది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రోల నుంచి 64వేల మంది ఉద్యోగులను బయటకు వెళ్లారు. అంతర్జాతీయ మార్కెట్లో ఐటీ సర్వీసులకు డిమాండ్ తగ్గడం, కస్టమర్లు వ్యయ నియంత్రణ మంత్రి జపిస్తున్న నేపథ్యంలో ప్రధాన ఐటీ కంపెనీల్లో హెడ్ కౌంట్ పడిపోయింది.భారత ఐటీ కంపెనీలకు గ్లోబల్‌ మార్కెటే కీలక ఆదాయ వనరుగా ఉన్న సంగతి తెలిసిందే.

– ఈ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను విప్రో ప్రకటించిన తాజా ఆర్థిక ఫలితాల్లో ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి సంస్థ ఉద్యోగులు 2,34,054గా ఉన్నారు.

-గతేడాది 2,58,570 మంది ఉండగా, 24,516 మంది తగ్గారు.

-ఇన్ఫోసిస్‌లో 3,43,234 నుంచి 3,17,240కి పడిపోయారు.

-ఏడాది వ్యవధిలో 25,994 మంది దిగారు.

– టీసీఎస్‌లో ఈ మార్చి 31 నాటికి 6,01,546 మంది ఉద్యోగులున్నారు.

-గతేడాది మార్చి ఆఖరుతో పోల్చితే 13,249 మంది తగ్గిపోయారు.

ఇది కూడా చదవండి: నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు..ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు.!

Latest News

More Articles