Sunday, May 12, 2024

పండుగకు ఊరొచ్చిన ఏడో తరగతి బాలిక.. అదే రోజు గుండెపోటుతో మృతి

spot_img

నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెసంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది గుండెపోటుతో మరణించారు. దీనంతటికి కారణం మన జీవనశైలే. ఒక్కప్పుడు 60ఏళ్లు పైబడిన వారికి గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు పట్టుమని పదేండ్లు కూడా లేని పిల్లలకు గుండెపోటు వచ్చిన ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం.

Read Also: నేడే బీఆర్ఎస్ మ్యానిఫెస్టో.. అటు ప్రజలు.. ఇటు పార్టీలలో తీవ్ర ఉత్కంఠ

తాజాగా నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని అదరంగి మైథిలి(12) దసరా సెలవులకు ఇంటికివచ్చిన రోజే గుండెపోటుతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కంజర గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు సాయిలక్ష్మికి గ్రెసీ, మైథిలి ఇద్దరు కుమార్తెలు. సాంఘిక సంక్షేమ గురుకులంలోనే గ్రెసీ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, మైథిలి ఏడో తరగతి చదువుతున్నారు. దసరా సెలవులు కావడంతో శుక్రవారం వారిద్దరూ ఇంటికి వచ్చారు. సాయంత్రం వరకు హుషారుగా కనిపించిన బాలిక.. రాత్రి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వస్తుందని తల్లికి చెప్పడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో విద్యార్థిని చనిపోయిందని వైద్యుడు తెలిపారు. పండుగకొచ్చిన బాలిక చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.

Latest News

More Articles