Sunday, May 19, 2024

పాక్ మ్యాచ్‎లో రోహిత్ మూడు రికార్డులు

spot_img

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రెచ్చిపోయాడు. ఆప్ఘనిస్తాన్‌పై సెంచరీతో రాణించిన రోహిత్.. దాయాది పాకిస్థాన్‌పై అదరగొట్టే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 63 బాల్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను రోహిత్ 473 మ్యాచుల్లో అందుకున్నాడు. అంతేకాకుండా అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్స్‎లు బాదిన రికార్డ్ ఇప్పటివరకు క్రిస్ గైల్ పేరు మీద ఉంది. ఆ రికార్డ్ ను కూడా రోహిత్ తన పేరు మీద లిఖించుకున్నాడు. గైల్ 483 మ్యాచుల్లో 553 సిక్స్‎లు కొడితే.. రోహిత్ 473 మ్యాచుల్లో 556 సిక్స్‎లు కొట్టాడు. దీనితో పాటు మరో రికార్డ్ కూడా రోహిత్ ఖాతాలో చేరింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఐదు కంటే ఎక్కువ సిక్సర్లను మూడుసార్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. తద్వారా గేల్, ఏబీ డివిలియర్స్ రికార్డును సమం చేశాడు.

Read Also: పండుగకు ఊరొచ్చిన ఏడో తరగతి బాలిక.. అదే రోజు గుండెపోటుతో మృతి

కాగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ అలవోకగా సిక్స్‌లు బాదడం చూసి ఆశ్చరపోయిన ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్‌.. అంత సులభంగా షాట్లు ఎలా కొడుతున్నావని అతడిని ప్రశ్నించాడు. దీంతో రోహిత్ అంపైర్‌కు తన బైసెప్స్‌ను చూపించాడు. తన కండ బలంతోనే సిక్స్‌లు బాదుతున్నానని నవ్వుతూ వివరించాడు. కాగా.. రోహిత్ బైసెప్స్ చూపిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read Also: నేడే బీఆర్ఎస్ మ్యానిఫెస్టో.. అటు ప్రజలు.. ఇటు పార్టీలలో తీవ్ర ఉత్కంఠ

Latest News

More Articles