Friday, May 17, 2024

భారత్‌లో 9.3లక్షల క్యాన్సర్‌ మరణాలు!

spot_img

న్యూఢిల్లీ: భారత్‌ లో 9.3లక్షల క్యాన్సర్‌ మరణాలు చోటుచేసుకున్నాయని లాన్సెట్‌ పత్రిక తన ఆగ్నేయాసియా విభాగంలో ప్రచురించిన వ్యాసంలో వెల్లడించింది. 2019 గణంకాలను పేర్కొంటూ.. భారత్‌లో 12 లక్షల కొత్త క్యాన్సర్‌ కేసులు బయటపడగా.. 9.3లక్షల మరణాలు సంభవించినట్లు తెలిపింది.

ఆసియాలో చైనా, జపాన్‌, భారత్‌లో అత్యధిక కేసులు, మరణాలు ఉన్నాయని పేర్కొంది. 2019లో ఆసియాలో మొత్తం 94లక్షల క్యాన్సర్‌ కేసులు బయటపడగా.. 56 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.  చైనాలో 48 లక్షల కేసులు, 27లక్షల మరణాలు.. జపాన్‌లో 9 లక్షల కేసులు, 4.4 లక్షల మరణాలు చోటుచేసుకొన్నాయని లాన్సెట్ వివరించింది.

ఈ పరిశోధనలో భారత్‌ నుంచి కురుక్షేత్ర నిట్‌, జోధ్‌పుర్‌, బటిండా ఎయిమ్స్‌ చెందిన రీసెర్చ్ బృందాలు కూడా పాల్గొన్నాయి. ఆసియాలోని 49 దేశాల్లో 29 క్యాన్సర్లపై ఈ స్టడీని నిర్వహించారు. ఆసియాలో ముఖ్యంగా గొంతు,  ఊపరితిత్తుల క్యాన్సర్లు సోకుతున్నట్లు తెలిపారు. పొగ తాగడం, మద్యం, కాలుష్యం వంటివి క్యాన్సర్‌ సోకడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయట.

Latest News

More Articles