Friday, May 3, 2024

3 జిల్లాలు మినహా.. ధాన్యం కొనుగోళ్లు పూర్తి.. రైతుల ఖాతాల్లో 6వేల కోట్లు జమ

spot_img

హైదరాబాద్: రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు దాదాపు పూర్తయింది. యాసంగి లో దేశంలోనే అత్యధిక వరి ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో 95 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

రంగారెడ్డి, ములుగు, మేడ్చల్ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో వరి ధాన్యం కొనుగోలు పూర్తయింది. 7036 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా.. 4540 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ పూర్తయింది. గత సంవత్సరం యాసంగి లో 50.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. ఇప్పటికే ఈ యాసంగిలో 63 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.

వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల ఖాతాలో దాదాపు 6000 కోట్లు జమ చేసినట్టు వెల్లడించారు. మిగతా డబ్బులు వారం రోజుల్లో రైతుల ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. ఒక్కటి రెండు రోజుల్లో రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు పూర్తి కానున్నది.

Latest News

More Articles