Sunday, May 12, 2024

సిద్దిపేటలో అగ్నిప్రమాదం. ఐదు షాప్స్ దగ్ధం

spot_img

సిద్ధిపేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5 షాప్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఓ దుకాణంలో మంటలు చేలరేగాయి. అవి క్షణాల్లో పక్కన ఉన్న షాప్స్ కు వ్యాపించాయి. క్రమంగా మంటలు ఎక్కువ కావటంతో ఐదు దుకాణాలు పూర్తి కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఐతే అర్ధరాత్రి సమయం కావటంతో దుకాణాల్లో ఎవరు లేకపోవటంతో ప్రాణనష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles