Friday, May 17, 2024

తెలంగాణలో మరో మూడురోజులపాటు వర్షాలు..!

spot_img

హైదరాబాద్‌: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ దిశ నుంచి దిగువ స్థాయిలోని గాలులు తెలంగాణలోకి వీస్తున్నాయని.. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ పరిసరాల్లో 9వ తేదీన వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, ఇది తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతోపాటు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Latest News

More Articles