Monday, May 20, 2024

పూలే విగ్రహ సాధన ఉద్యమం.. బీసీలకు ఐక్యతకు పునాది అవ్వాలి

spot_img

హైదరాబాద్: భ్రూణహత్యలకు వ్యతిరేకంగా, కులాల వివక్ష పారద్రోలడానికి పూలే ఎంతగానో కృషి చేశారని బీఆర్ఎస్ నేత వి ప్రకాశ్ అన్నారు. బీసీ, దళితులకు కాకుండా అన్ని వర్గాలకు పూలే ఆదర్శవంతమైన వ్యక్తి అని కొనియాడారు. పూలేను కేవలం బీసీగా చూడవద్దు… అన్ని వర్గాలకు పూలే ఆరాధ్యుడని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో బతుకమ్మ ప్రజల చేతుల్లో సాంస్కృతిక ఆయుధం అయిందని, ఇప్పుడు కూడా పూలే విగ్రహ సాధన ఉద్యమం బీసీలకు ఐక్యతకు పునాది అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కవిత చేపట్టబోయే ఈ ఉద్యమంలో తాను కలిసి వస్తానని ప్రకటించారు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ఎమ్మెల్సీ కవితి అధ్యక్షతన మాసాబ్ ట్యాంక్‎లోని ఖాజా మాన్షన్‎లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Also Read.. తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే

Latest News

More Articles