టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప మూవీతో అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. తాజాగా బన్నీకి మరో అరుదైన అవకాశం వచ్చింది. పుష్ప సినిమాకు మరో అంతర్జాతీయ గౌరవం దక్కనుంది. అది దగ్గర నుంచి చూడటానికి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ జర్మనీకి చేరుకున్నారు.
Icon star 🌟 @alluarjun is en route to Germany 🇩🇪 to represent the richness of Indian cinema at a prestigious film festival in Berlin.#AlluArjun #Pushpa2TheRule #Pushpa pic.twitter.com/RF68Zz5qXj
— Shreyas Media (@shreyasgroup) February 15, 2024
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు బన్ని నిన్న బెర్లిన్ చేరుకున్నాడు. ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్పను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. తన పర్యటనలో భాగంగా ఇంటర్నేషనల్ దర్శకులు, చిత్ర నిర్మాతలు, మార్కెట్లో సినిమా హక్కుల బయ్యర్స్ తో కూడా బన్నీ మాట్లాడే అవకాశం ఉంది. పుష్ప మూవీ స్క్రీనింగ్ లో భాగంగా ఇంటర్నేషనల్ మీడియాతో అల్లు అర్జున్ మాట్లాడతాడు.
ఇది కూడా చదవండి: అనుమానంతో భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య..అనాథలైన చిన్నారులు..!!