ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య వివాహం సోమవారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్ తో ఐశ్వర్య ఏడడుగులు వేసింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులకోసం మంగళవారం చెన్నైలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సౌత్ స్టార్స్ తోపాటు బాలీవుడ్ స్టార్స్ ఈ రిసెప్షన్ కు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవిదంపతులు, మోహన్ లాల్, అట్లీ, విజయ్ సేతుపతి, జాన్వీకపూర్, వెట్రీమారన్ , లోకేశ్ కనగరాజ్, అనిరుధ్, రకుల్ ప్రీత్ సింగ్, రెహమాన్, రామ్ చరణ్ తేజ తదితరులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రణ్ వీర్ సింగ్ డ్యాన్స్ తో అదరగొట్టారు. శంకర్ చిన్న కుమార్తె అదితితో కలిసి లుంగీ డ్యాన్స్, వాతి కమింగ్ వంటి పాటలకు అదిరే స్టెప్పులేశారు. అట్లీ కూడా డ్యాన్స్ చేవాడు. దీనికి సంబంధించి పలు వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
కాగా శంకర్ కూతురు ఐశ్వర్యకు ఇది రెండో వివాహం. 2021లో క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో ఆమె వివాహం జరిగింది. మ్యుచువల్ అండస్టాండింగ్ తో ఇద్దరుకూడా విడాకులు తీసుకున్నారు. ఒక తరుణ్ కార్తీక్ శంకర్ సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నారు.
#RanveerSingh #AditiShankar #Arjithsankar killing the dance floor with #ThalapathyVijay𓃵 ATBB #ApidiPodu song in @shankarshanmugh elder daughter wedding @actorvijay #GhilliReRelease pic.twitter.com/fpDxLzQfkK
— Suresh samy (@sureshsamy28) April 16, 2024
ఇది కూడా చదవండి:ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో కాల్పుల మోత..40 మంది నక్సల్స్ మృతి.!