Wednesday, May 1, 2024

అయోధ్య రాముడికి సూర్యతిలకం..అపూర్వ ఘట్టాన్ని చూసి పులకించిన భక్తులు..!

spot_img

యూపీలోకి అయోధ్య రామాలయం ఈసారి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత తొలినవమి వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత ద్రుశ్యం ఆవిష్క్రుతమైంది. బాలరాముడి నుదిటిపై కనిపించిన సూర్యతిలకంతో భక్తులు పులకించిపోయారు. అధునాతన సాంకేతిక సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదిటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో
ప్రసరించాయి.

మూడవ అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహంప నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య రామాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపించింది. బెంగుళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్లు ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు.

ప్రతి శ్రీరామ నవమి రోజున శ్రీరాముడి విగ్రహంపై ఈ తిలకం దిద్దే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి..వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి కదా. గ్రహాల పరిభ్రమణం సమయం ఒకేలా ఉంటుందా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే టెక్నాలజీ తరహాలో గేర్ టీత్ మెకానిజం వినియోగించినట్లు అధికారులు తెలిపారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్పల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ నవమి రోజువారు అనుకున్న చోటకు తీసుకువస్తుంది.

ఇది కూడా చదవండి : శంకర్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్..డ్యాన్స్ తో అదరగొట్టిన బాలీవుడ్ స్టార్స్..!

Latest News

More Articles