Tuesday, May 21, 2024

తల్లి, భార్యబిడ్డలను చంపి తాను ఉరేసుకుని..!

spot_img

ఆర్థిక పరిస్థితులు ఓ కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్నాయి. అప్పుల కారణంగా మానసికంగా కుంగిపోయిన ఓ వైద్యుడు తన తల్లిని, భార్య, పిల్లలను హతమార్చి తాను ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్వంతంగా ఆసుపత్రిని ప్రారంభించే ప్రయత్నాల్లో భాగంగా సదరు వైద్యులు అప్పులపాలు అయ్యాడు. వాటిని బయటపడలేక ఈ ఘాతుకానికి ఒడిగనట్లు తెలుస్తోంది.

విజయవాడ నగరంలోని పటమటలో ఈ ఘటన సంచలనం రేపింది. పటమట వాసవీనగర్ కు చెందిన ధరావత్ శ్రీనివాస్ ఆర్థోపెడిక్ వైద్యుడు. భార్య ఉష, కుమార్తె శైలజ, కుమారుడు శ్రీహన్, తల్లి రమణమ్మ తో కలిసి ఉంటున్నారు. తండ్రి జమలయ్య నాయక్ పోలీసు శాఖలో పనిచేసి పదేళ్ల కింద మరణించాడు. శ్రీనివాస్ సోదరుడు దుర్గాప్రసాద్ హైదరాబాద్ లో అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. చెల్లెలు లక్ష్మీకి వివాహం అయ్యింది. వీరి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడు కాగా వైద్యుడైన శ్రీనివాస్ సొంతంగా ఆసుపత్రి నిర్మించేందుకు గతేడాది ఓ భవనాన్ని లీజుకు తీసుకున్నారు.

సుమారు రూ. 3కోట్ల మేరు వెచ్చించాడు. అయినా పనులు పూర్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన స్నేహితులు కొందరు భాగస్థులుగా చేరారని..వారు శ్రీనివాస్ ను మోసగించి రోడ్డు పడేశారని..బంధువులు ఆరోపిస్తున్నారు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు మరోవైపు నమ్మినవారు మోసం చేయడాన్ని జీర్ణించుకోలేని శ్రీనివాస్ రెండు నెలలు మానసిక వేధనతో కుంగిపోతున్నాడు. అందర్నీ చంపి తాను కూడా చనిపోయావాలని నిర్ణయించుకున్నాడు. వీరి పాట ఆటిజం సమస్యతో బాధపడుతోంది. సోమవారం అర్ధరాత్రి దాటినతర్వాత శ్రీనివాస్ వేర్వేరు గదుల్లో నిద్రపోతున్న తల్లి భార్య పిల్లలను చాకుతో మెడ భాగంలో కోసాడు. వారంతా మరణించారు.

తర్వాత మంగళవారం ఉదయం 6.30గంటల సమయంలో ఇంట్లో నగదు, బంగారాన్ని ఓ బ్యాగులో పెట్టి శ్రీనావాస్ దానిని తన కారులో ఉంచారు. కారు తాళానికి కాగితం చుట్టి ఎదురింటి గేటుకు ఉన్న పెట్టెలో పెట్టాడు. అదేంటని అడుగుతే తాను ఊరు వెళ్తున్నాని..అన్నయ్య వస్తే కారు తాళం ఇవ్వమనిచెప్పి ఇంట్లోకి వెళ్లాడు. ఉదయం 9.30గంటలకు పనిమనిషి వచ్చి ఎంత పిలిచినా పలకలేదు. గోడపై నుంచి చూడగా పోర్టికోలో శ్రీనివాస్ ఉరేసుకుని కనిపించారు.

స్థానికులు వచ్చి చూసేసరికే శ్రీనివాస్ మరణించాడు. ఎదురింటివారు కారు తాళానికి చుట్టినకాగితం తీసి చూడగా..తన సోదరుడు అడ్వెకేట్ దుర్గప్రసాద్ కు మాత్రమే ఇవ్వమని ఆయన ఫోన్ నెంబర్ రాసి ఉంది. వారు ఆయకు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాస్్ పోర్టికోలో ఉరేసుకుని మరణించగా..లోపల వేర్వేరు గదుల్లో భార్య, పిల్లలు, తల్లి శవాలు ఉన్నాయి. శ్రీనివాస్ తన ఫోన్లో వాయిస్ ను రికార్డు చేశారు. కారులో ఉంచిన నగదు, నగలను తన అన్న దుర్గప్రసాద్ కు ఇవ్వమని ఉంది. ఆర్థిక ఇబ్బందులతో మరణించినట్లు రికార్డు చేశారు. పోలీసులు కారులో ఉన్న నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. 16లక్షలు, 300 గ్రాముల బంగారం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా  చదవండి: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు త్వరలోనే చట్టం.!

Latest News

More Articles