Wednesday, May 22, 2024

తగ్గుతున్న బంగారం ధరలు..కొనేందుకు మంచి సమయం.?

spot_img

బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. నేడు కూడా స్వల్పంగా తగ్గాయి. గత నాలుగు రోజులు బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం లేదు. ఇవాళ ఉదయం 6గంటల నాటికి నమోదు అయిన వివరాల ప్రకారం 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ. 10తగ్గుదల కనిపించింది. ఇక వెండి ధర కిలోకి రూ. 100 చొప్పున తగ్గింది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో నేడు ఉదయం 6గంటల సమయానికి పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66, 540గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,590గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 66,690గా ఉంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,740గా ఉంది. ముంబైలో కూడా 22క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ. 66,540గా నమోదు అయ్యింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,590గా ఉంది.

అటు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.86,900గా ఉండగా..విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.86,900పలుకుతోంది. విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.86,900,ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.83,400గా నమోదు అయ్యింది. ముంబైలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.83,400గా పలుకుతోంది.

ఇది కూడా చదవండి : తల్లి, భార్యబిడ్డలను చంపి తాను ఉరేసుకుని..!

Latest News

More Articles