Tuesday, May 21, 2024

సింగరేణిని ముంచడమే బడే భాయ్, చోటే భాయ్ లక్ష్యం.!

spot_img

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్..కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్డు షోలో కేసీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్, ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు. బడే భాయ్ మోదీ, చోటే భాయ్ రేవంత్..బీఆర్ఎస్ ను ఓడించేందుకు కలిసి పనిచేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు వీరిద్దరూ కలిసి సింగరేణిని ముంచేందుకుప్లాన్ చేస్తున్నారంటూ ఆరోపించారు కేసీఆర్.

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కొత్తగూడెంను జిల్లా చేయడానికి కారణం మారుమల గిరిజన, ఆదివాసీలకు న్యాయం జరగాలని, వారికి పాలన అందాలని, కొత్తగూడెంలో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీతోపాటు పట్టణాన్నిడెవలప్ చేసుకున్నాము. రేవంత్ రెడ్డి కొత్తగూడెం జిల్లాను రద్దు చేసే ప్లాన్ చేస్తున్నారు. అడ్డగోలుగా హామీలు ఇస్తూ దొంగ పథకాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. రైతు బంధు 15వేలు ఇస్తామని చెప్పి..ఇప్పుడు ఒక్కరూపాయి కూడా ఇచ్చిర్రా అని ప్రశ్నించారు.కల్యాణ లక్షమీ తులం బంగారం, మహిళలకు నెలకు రూ. 2,500, 2లక్షల రుణమాఫీ ఇలాంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనతో ఒక్క నిమిషం కూడా కరెంట్ పోలేదు..ఇప్పుడు అసలు కరెంటే లేదన్నారు.

ఇక పినపాకవంటి నియోజకవర్గ పరిధిలోని ఆదివాసీ గుంపులకు, గిరిజన గూడెంలకు మిషన్ భగీరథ రావడం లేదు. వేలాదిమందికి పోడు పట్టాలు అందించాం. గిరిజనులకు మైనార్టీలకు గురుకులాలు పెట్టి విద్యలో మార్పులు తీసుకువచ్చాం. ఓవర్సిస్ స్కాలర్ షిప్స్ , ఫీజ్ రీయంబర్స్ మెంట్స్ నిలిచిపోయాయి. గిరిజన బిడ్డల కోసంకోట్ల రూపాయల ఖర్చతో గిరిజన భవనాలను కట్టించాం. సింగరేణి బిడ్డలకు స్పెషల్ ఇంక్రిమెంట్లు, బోనస్ లు కూడా ఇచ్చాం. సింగరేణిని ముంచే పనిలో రేవంత్ , మోదీ ఉన్నారంటూ కేసీఆర్ ద్వజమెత్తారు.

పినపాక లాంటి నియోజకవర్గ పరిధిలోని ఆదివాసీ గుంపులకు, గిరిజన గూడెలు మిషన్ భగీరథ రావట్లేదు. వేల మందికి పోడు పట్టాలు ఇచ్చాం. గిరిజనులకు, మైనారిటీలకు గురుకులాలు పెట్టి విద్యలో సమూల మార్పు తెచ్చాం. ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు, ఫీజ్ రియంబర్స్ మెంట్ లు నిలిచిపోయాయి. గిరిజన బిడ్డల కోసం కోట్ల రూపాయల ఖర్చుతో గిరిజన భవనాలు కట్టించాం. సింగరేణి బిడ్డలకు స్పెషల్ ఇంక్రిమెంట్లు, బోనస్ లు ఇచ్చాం. సింగరేణిని ముంచే పనిలో చోటా భాయ్ రేవంత్ రెడ్డి, బడా భాయ్ నరేంద్ర మోడీ ఉన్నారు” అని కేసీఆర్ అన్నారు.

ఇది కూడా చదవండి: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు త్వరలోనే చట్టం.!

Latest News

More Articles