Wednesday, May 22, 2024

కేసీఆర్ దెబ్బంటే అట్లుంటది మరి..దిగొచ్చిన సర్కార్.!

spot_img

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఒక్కసారి గర్జించారంటే ఎంతటివారైనా దిగిరావాల్సిందే. ఇప్పుడు తెలంగాణ సర్కార్ కూడా కేసీఆర్ దెబ్బకు దిగొచ్చింది. కేసీఆర్ ట్వీట్ చేసిన 24గంటల్లోపే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు తెరిచే ఉంచుతామని ప్రకటించింది. దీంతో  ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ  ఉత్తర్వులు జారీ చేశారు. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు వేసవి సెలవులను ఉపయోగించుకుంటామని..హాస్టళ్లను మూసివేయకూడదని ఈమధ్యే విద్యార్థులు తమకు విజ్నాపన వచ్చిందని..వారి వినతి మేరకు వేసవి సెలవుల సమయంలోనూ హాస్టళ్లను తెరిచి ఉంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని రిజిస్ట్రార్ తన ఉత్తర్వుల్లో వెల్లడించారు.

అయితే కొన్ని రోజుల కిందట విద్యార్థులు విజ్నప్తి చేసినప్పుడు చీఫ్ వార్డెన్ నోటీసు జారీ చేసే ముందు దానిని ఎందుకు పరిశీలించలేదన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పైగా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారనేది ఇప్పటికిప్ుపడు చోటుచేసుకున్న పరిణామం కాదు. అంటే దీన్ని బట్టి ఈజీగా అర్ధమవుతుంది. కేసీఆర్ దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చిందని..పలువురు విద్యార్థులు అంటున్నారు. వేసవి సెలవుల్లోనూ వర్సిటీ హాస్టళ్లను తెరిచే ఉంచుతామని ప్రకటించిన రిజిస్ట్రార్ మెస్ ల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీనిపై చీఫ్ వార్డెన్ సంప్రదిస్తే..సెలవుల్లో హాస్టళ్లలో ఉండే విద్యార్థుల సంఖ్య ఆధారంగా మెస్ లను ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: సింగరేణిని ముంచడమే బడే భాయ్, చోటే భాయ్ లక్ష్యం.!

Latest News

More Articles