Tuesday, May 21, 2024

ఢిల్లీలో కలకలం..పలు స్కూళ్లు బాంబు బెదిరింపులు.!

spot_img

బాంబు బెదిరింపు కాల్స్ తో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం ఉదయం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని పలు ప్రముఖ పాఠశాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను ఖాళీ చేయించారుపోలీసులు.బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలోని ద్వారక, చాణక్యపురి, మయూర్ విహార్, వసంత్ కుంజ్, సాకేత్ తోపాటు నోయిడాలోని కనీసం 12 స్కూళ్లకు ఈ మెయిల్ వచ్చినట్లు సమాచారం. కొన్ని పాఠశాలల్లో ఈ రోజులు పరీక్షలు జరుగుతున్నాయి. బెదిరింపుల నేపథ్యంలో వాటిని మధ్యలోనే ఆపి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. పేరెంట్స్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఆయా పాఠశాలలకు చేరుకుని పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు.

ప్రస్తుతం ఈ పాఠశాలల ప్రాంగణాల్లో పోలీసులు బాంబ్ డిటెక్షన్ గ్రూపుతో చెకింగ్స్ చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా పాఠశాలలకు చేరుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద పేలుడు పదార్థాలు లభించలేదని తెలుస్తోంది. బెదిరింపులకు పాల్పడిన ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్ ఐపీ అడ్రస్ లను బట్టి విదేశాల నుంచి వీటిని పంపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒకే వ్యక్తి నుంచి ఈ బెదిరింపులు వచ్చి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఢిల్లీలోని పలు పాఠశాలలకు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. అవి ఫేక్ బెదిరింపులు అయి ఉంటాయని పోలీసులు అప్పట్లో వెల్లడించారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ దెబ్బంటే అట్లుంటది మరి..దిగొచ్చిన సర్కార్.!

Latest News

More Articles