Tuesday, May 21, 2024

ఆల్కాహాల్ తాగితే షుగర్ తగ్గుతుందా?ఎంత వరకు నిజం.!

spot_img

ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమరని అందరికీ తెలిసిందే. ఆల్కహాల్ తాగడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రించడంలో సహాయపడుతుందని చాలా మంది అంటుంటారు. వారు. డయాబెటిక్ షేషంట్ అయినప్పటికీ మద్యం సేవిస్తుంటారు. చాలా మంది షుగర్ పేషంట్లు ఇలాంటి వాటిని అస్సలు నమ్మరు. దీంతో మద్యం ఎక్కువగా తాగుతుంటారు. ఆల్కహల్ సేవించడం ద్వారా షుగర్ నిజంగా కంట్రోల్ చేయవచ్చా అనే ప్రశ్నఇప్పుడు తలెత్తుతోంది. అన్నింటికంటే ఆల్కహాల్ తీసుకోవడంలో రక్తం చక్కెరపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. షుగర్ పేషంట్లు మద్యంసేవించవచ్చా ?వీటి గురించి సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం.

వెబ్ మెడ్ నివేదిక ప్రకారం..మీకు షుగర్ ఉంటే ఆల్కహాల్ సేవించడం వల్ల మీ రక్తంలో చక్కెర సడెన్ గా పెరుగుతుంది లేదా చాలా వేగంగా షుగర్ లెవల్స్ పడిపోతాయి. రెండు పరిస్థితులు షుగర్ పేషంట్లకు ప్రమాదకరమైనవిగా పరిగణించబడుతాయి. ఆల్కహాల్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆల్కహాల్ రక్తంలో చక్కెరస్థాయిలలో వేగవంతమైన హెచ్చుతగ్గులకుకారణం అవుతుంది. షుగర్ రోగులు దీనిని తగ్గించాలి. మద్యం సేవించడం మీకు సురక్షితమా కాదా అని తెలుసుకోవడానికి, మీరు మీ వైద్యుని నుంచి సలహా పొందవచ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రాకారం..మితంగా ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల మీ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అయితే అధికంగా తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ ప్రమాదకరస్థాయికి పడిపోతాయి. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ రోగులకు ఆల్కహాల్ సేవించడం మరింత ప్రమాదకరంగా పరిగణించవచ్చు. బీర్ వైన్ కూడా చక్కెరస్థాయిలకు మంచివి కావు. బీర్, స్వీట్ వైన్ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెరను పెంచుతాయి. ఇవి మాత్రమే కాదు ఆల్కహాల్ మీ ఆకలిని పెంచుతుంది. దీంతో మీరు అవసరమైనదానికంటే ఎక్కువగా తింటారు. షుగర్ మందులు లేదా ఇన్సులిన్ ప్రభావాన్ని ఆల్కహాల్ తగ్గించగలదని అనేక పరిశోధనలు ఇప్పటికే వెల్లడించాయి. ఇది షుగర్ నియంత్రించడం కష్టతరం చేస్తుంది. ఆల్కహాల్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది కాబట్టి డయాబెటిక్ రోగులను గుండె సమస్యలకు గురి చేస్తుంది.

ఇది కూడా చదవండి: కేసీఆర్ దెబ్బంటే అట్లుంటది మరి..దిగొచ్చిన సర్కార్.!

Latest News

More Articles