Tuesday, May 21, 2024

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు త్వరలోనే చట్టం.!

spot_img

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు మూడు లేదా నాలుగు నెలల్లో కొత్త చట్టం తీసుకువచ్చేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తుందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా హేతుబద్దీకరణ చేపడతామని వెల్లడించారు. సర్కార్ బడుల్లో విద్యతోపాటు వికాసం,సాంస్క్రుతిక, క్రీడా రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ లోని పదో తరగతి ఫరీక్ష ఫలితాల విడుదల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారన్న ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రత్యేక చట్టం రూపకల్పనపై ప్రభుత్వం మరింత ద్రుష్టిసారించింది.

డీఎస్సీ ద్వారా అదనంగా 11 వేల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. వాటన్నింటితో కలిపి హేతుబద్దీకరణ చేపడతామని తెలిపారు. టెట్ ఫలితాల అనంతరం ఉపాధ్యాయుల బదిలీలు, పదొన్నతులు ఉంటాయని చెప్పారు. విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని, విద్యార్థుల్లో వ్యక్తిత్వ, మానసిక వికాసం, దేహదారుడ్యం పెంపొందించేందుకు ప్రత్యేక సాంస్క్రుతిక క్రీడాశిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. వారంలో నాలుగు రోజుల పాటు ఇవి ఉంటాయన్నారు. ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థల ద్వారా వీటిని చేపడతామని తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదును పకడ్బందీగా నిర్వహించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ విధానంతో పనిచేసే యాప్ ను ప్రవేశపెడతామని బుర్రావెంకటేశం తెలిపారు. పది పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరగడం అభినందనీయమన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందకూడదని..ఉత్తీర్ణత కాకపోవడానికి ఎన్నో కారణాలుంటాయని తెలిపారు. వాటిని విశ్లేషించుకుని సప్లిమెంటరీ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావచ్చన్నారు.

ఇది కూడా చదవండి: వందేండ్ల రికార్డ్ బ్రేక్ చేసిన ఎండలు.!

Latest News

More Articles