Wednesday, May 22, 2024

వందేండ్ల రికార్డ్ బ్రేక్ చేసిన ఎండలు.!

spot_img

ఈ ఏడాది ఎండలు వండేండ్ల రికార్డును బ్రేక్ చేశాయి. మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. 103 ఏండ్లలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు ఈసారి నమోదు అయ్యాయి. వాతావరణశాఖ అందించిన సమాచారం ప్రకారం 1921 తర్వాత 2024 ముందు ఏ ఒక్క ఏడాదిలోనూ 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవ్వలేదు. ఈ సంవత్సరం ఏప్రిల్ లోనే రాష్ట్రంలో పలుచోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటడం విశేషం. రానున్న ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఈ ఐదురోజుల్లో దేశంలోని తూర్పు,దక్షిణ భాగంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని తెలిపింది.

మే నెలలో గతంలో కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలుస్తోంది. ఇప్పటికే రెండో దశ పోలింగ్ పై ఎండల ప్రభావం తీవ్రంగా పడినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మే నెలలో జరిగే మిగతా 5 దశల పోలింగపై కూడా ఎండల ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ భావిస్తోంది. ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు.

నిప్పుల కొలిమిలా రాష్ట్రం:
రాష్ట్రంలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మే 3 వరకు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. వడదెబ్బతో సోమవారం ఐదుగురు మరణించారు.

ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్:
దేశవ్యాప్తంగా ఎండలు భగభగమండుతున్నాయి. ఏపీ, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. రానున్న రెండు మూడు రోజుల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. సాధ్యమైనంత వరకు ఇంటి వద్దే ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించింది. మరోవైపు తెలంగాణ, కర్నాటక, సిక్కిం రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఇది కూడా చదవండి: తుమ్మ‌ల వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ ట్వీట్..ఏమన్నారంటే?

Latest News

More Articles