Friday, May 17, 2024

తుమ్మ‌ల వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ ట్వీట్..ఏమన్నారంటే?

spot_img

కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఆగమయ్యారు. అన్నదాతల జీవితాల్లో అంధకారం నెలకొంది. సాగుకు సరిపడా నీరు లేకపోవడం, కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయాయి. అక్కడక్కడ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దిక్కేలేదు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్ధితుల్లో పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు ప్రభుత్వం నోట్లో నుంచి రావడం లేదు. రైతుబంధు అడిగితే చెప్పులతో కొడతామని రైతులను బెదిరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అటు రైతు బంధు ఇవ్వక, సాగునీరు కరెంట్ ఇవ్వక రైతులను నట్టేట ముంచేసింది కాంగ్రెస్ సర్కార్.

కాగా రైతు బంధపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తనకు రైతు బంధు ఇంకా రాలేదంటూ ఓ సమావేశంలో మాట్లాడారు. తన పక్కనే ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వైపు చూస్తూ..నాకే ఇంకా రైతు బంధురాలేద..ఎందయ్యా అని భట్టి విక్రమార్కను అడిగితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన తర్వాత ఇస్తా అన్నారని తుమ్మల పేర్కొన్నారు.


తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. రైతు బంధు ఇవ్వకుండా తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమంటూ కేసీఆర్ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: టీమ్ఇండియా జట్టు ప్రకటించిన బీసీసీఐ..రాహుల్ ఔట్..పంత్ఇన్.!

Latest News

More Articles