Sunday, May 19, 2024

నేషనల్ హైవేపై విరిగిపడిన కొండచరియలు

spot_img

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఒక హైవేకు చెందిన ప్రధాన భాగం భారీగా కొండ చరియలు విరిగిపడడంతో కొట్టుకుపోయింది. దీంతో దిబంగ్ లోయతో రోడ్డు కనెక్టివిటీ తెగిపోయింది. చైనా సరిహద్దుల్లో ఉన్న ఈ జిల్లాలోని హైవేలో ప్రధాన భాగం కొట్టుకుపోవడంతో అవతలి వైపునకు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గడచిన కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జాతీయ శైవే 33పైన ఉన్న హున్ని, అనిని మధ్య ఇవాళ(గురువారం) భారీగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.

రియాంగ్, అనిని మధ్య రోడ్డు కొట్టుకుపోవడంతో పునరుద్ధరణకు కనీసం మూడు రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. 235 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు రియాంగ్‌ను దిబాంగ్ లోయ జిల్లా ప్రధాన కార్యాలయం అనినితో కలుపుతుంది. ఈ లోయ మీదుగానే చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. లోయలోనే దిబాంగ్ నది ప్రవహిస్తుంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 547 నామినేషన్లు

Latest News

More Articles