Wednesday, May 22, 2024

ఏపీలో కూలిన బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జి.. కిందపడ్డ లారీ

spot_img

ఏపీలోని ఓ పురాతన బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జి మీద ఉన్న లారీ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ భయంకర ఘటన శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురంలోని బహుదా నది మీద ఉన్న బ్రిడ్జి మీద బుధవారం ఉదయం జరిగింది. ఉదయం 6.30 గంటల సమయంలో ఈ బ్రిడ్జి మీద ఓ గ్రానైట్ లారీ వెళ్తుండగా.. ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. ఆ సమయంలో గ్రానైట్ లారీలో 70 టన్నుల బరువు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో బరువు ఎక్కువై బ్రిడ్జి కూలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. బ్రిడ్జి కింద లోతు తక్కువగా ఉండటంతో.. ప్రాణ నష్టం తప్పిందని అక్కడివారు చెబుతున్నారు. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం చూసిన వారు.. డ్రైవర్, క్లీనర్ అదృష్టవంతులని, అందుకే స్వల్ప గాయాలతో బయటపడ్డారని అనుకుంటున్నారు. ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా.. ఈ బ్రిడ్జిని 1929లో బ్రిటీష్ వారు అత్యంత పకడ్బందీగా నిర్మించడం గమనార్హం.

Latest News

More Articles