Monday, May 20, 2024

సీఎం కేసీఆర్‎కు దైవభక్తి ఎక్కువ.. అందుకే ఆలయాలకు మహర్దశ

spot_img

సీఎం కేసీఆర్ దైవభక్తి కలిగిన వ్యక్తి అని, అందుకే దేవాలయాలకు పెద్దపీట వేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కోనరావుపేట మండలం నాగారంలో కోదండరామస్వామి ఆలయ పున:ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. సీఎం కేసీఆర్ దైవ భక్తి కలిగిన వ్యక్తి. నాగారం కోదండరామస్వామి ఆలయానికి 86 లక్షల రూపాయలతో పున:నిర్మాణానికి ప్రభుత్వం కృషిచేస్తోంది. కొండపై వెలసిన కోదండ రామస్వామి ఆలయాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఆలయాలకు గుర్తింపు వచ్చింది. ఉత్తర భారతదేశం నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాదాద్రి, వేములవాడ రాజన్న ఆలయానికి తరలివస్తున్నారు. ఇదంతా కేసీఆర్ కృషి వల్లే సాధ్యమైంది’ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

పేదల దేవుడు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని మంత్రి వెల్లడించారు. దాదాపు ఇప్పటికే రూ. 100 కోట్లు వెచ్చించి భూసేకరణ, ఇతరత్రా అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లామన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు పాలకమండలి నియమించామని తెలిపారు. మరో ఐదారు ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణలో భాగంగా పాలకమండలి వెయ్యలేదు, ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.

 

Latest News

More Articles