Thursday, May 9, 2024

హీరో విక్రమ్‎కు ప్రమాదం.. విరిగిన పక్కటెముక

spot_img

‘అపరిచితుడు’ విక్రమ్‎కు తీవ్రగాయాలయ్యాయి. విక్రమ్‎ హీరోగా నటిస్తున్న ‘తంగలాన్’ సినిమా షూటింగులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విక్రమ్‎ పక్కటెముక విరిగింది. దాంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. విక్రమ్‎కు ఆపరేషన్ చేయాలని సూచించారు. కర్నాటక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన విలక్షణమైన నటనతో భాషతో సంబంధం లేకుండా అందరి అభిమానాన్ని పొందాడు. సినిమాలలో తన పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు విక్రమ్. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా నటిస్తున్న తంగలన్ సినిమా షూటింగ్ లో హీరో విక్రమ్ కి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

Latest News

More Articles