Saturday, April 27, 2024

హైదరాబాద్‌‎లో ‘జీరో షాడో డే’.. ఆ రెండు నిమిషాలు నీడ మాయం

spot_img

జీరో షాడో డే అనేది సంవత్సరానికి రెండుసార్లు జరిగే ఒక ప్రత్యేక ఖగోళ సంఘటన. సూర్యుడు ఆకాశంలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న సమయంలో ఏ వస్తువు లేదా జీవి యొక్క నీడలు కనిపించవు. దీనినే జీరో షాడో అంటారు. ఈ జీరో షాడో మన హైదరాబాద్‌‎లో కూడా ఆవిష్కృతం కానుంది. ఈ నెల 9న మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో ‘జీరో షాడో డే’ ఏర్పడనుంది. ఈ విషయాన్ని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ టెక్నికల్‌ అధికారి ఎన్‌.హరిబాబుశర్మ తెలిపారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయని చెప్పారు. అప్పుడు ఎండలో నిటారుగా ( 90 డిగ్రీల కోణం) ఉంచిన ఏ వస్తువు నీడా రెండు నిమిషాల పాటు అంటే 12:12 నుంచి 12:14 వరకు కనిపించదని పేర్కొన్నారు. మనం ఎండలో నిలుచున్నా.. మన నీడ సైతం కనిపించదని తెలిపారు. ఇదే విధంగా హైదరాబాద్‌లో ఆగస్టు 3వ తేదీన కూడా ‘జీరో షాడో డే’ ఏర్పడుతుందని ఆయన తెలిపారు.

కాగా.. ఇటీవల బెంగళూరులోనూ ఈ ఖగోళ అద్భుతం కనిపించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 12.17 గంటల సమయంలో రెండు నిమిషాల పాటు ఎండలో ఉన్న వస్తువులు, మనుషుల నీడ మాయమైంది. అదేవిధంగా భువనేశ్వర్‎లో మే 21, 2021న దాదాపు 3 నిమిషాల పాటు జీరో షాడో డే ఏర్పడింది.

Latest News

More Articles