Thursday, May 9, 2024

స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగకూడదా? తాగితే ఏమవుతుంది?

spot_img

ఎన్నో ఆచారాలు అనాదిగా వాడుకలో ఉన్నాయి. వాటిలో చాలా వాటికి శాస్త్రీయ ఆధారం లేదు. ఉదాహరణకు స్నానం చేసిన తర్వాత నీళ్లు తాగకూడదని అంటారు. స్నానం చేశాక నీళ్లు తాగడం మంచిది కాదనే వాదన ఎంతో మందిలో ఉంది. స్నానం చేసే సమయంలో శరీరంపై నీరు పోసిన వెంటనే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని సైన్సు చెబుతోంది. చల్లని నీరు అయినా, వేడినీరు అయినా శరీరం చల్లబడుతుంది. శరీరమే కాదు శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది.

స్నానం చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని సైన్సు చెబుతోంది. శరీరంలోని ఉండే వేడి వల్ల చాలా నీరు ఆవిరైపోతుంది. కాబట్టి శరీరం స్నానం చేసిన వెంటనే చల్లగా మారుతుంది. శరీరం చల్లగా ఉన్నప్పుడు, నీరు తాగితే అక్కడ ఉండే ఉష్ణోగ్రత సమతుల్యత అకస్మాత్తుగా తగ్గిపోతుంది. దీని వల్ల శరీరానికి కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ముఖ్యంగా వివిధ అవయవాలపై ఒత్తిడి పడుతుందని చాలా మంది అంటారు.

గతంలో దీనికి శాస్త్రీయ వివరణ లేదు. కానీ స్నానం చేసిన తర్వాత నీరు తాగడం వల్ల శరీరంలో సమస్యలు వస్తాయని చాలా మందికి నమ్మకం మాత్రం ఉంది. స్నానం చేసిన తర్వాత కాసేపు గడిచాక నీరు తాగడం వల్ల ఈ సమస్య రాదు,  వేడి సమతుల్యత దెబ్బతినదని చెబుతున్నారు నిపుణులు.

ఇది కూడా చదవండి: బెల్లీఫ్యాట్ తగ్గాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే.!

Latest News

More Articles