Monday, May 20, 2024

ఇది కదా మ్యాచ్ అంటే..హైదరాబాద్ చేతిలో లక్నో చిత్తు చిత్తు.!

spot_img

సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి రెచ్చిపోయింది. ఆల్ రౌండ్ ఆటతో దుమ్మురేపింది. ప్రత్యర్థిని గల్లీ జట్టుగా మార్చేస్తూ మరో మ్యాచ్ ను ఏకపక్షం చేసింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో లక్ నవూ సూపర్ జెయింట్స్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. అదిరిపోయే బౌలింగ్ తో ప్రత్యర్థిని సమర్థవంతంగా ఎదుర్కొంది. విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయింది. మొదట లఖ్ నవూ 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలింగ్ దాడికి విలవిలడానికి లఖ్ నవూకు నికోలస్ పూరన్, ఆయుష్‌ బదోని కాస్తంత ఆక్సిజన్‌ అందించారు. అనంతరం సన్‌రైజర్స్‌ 50 నిమిషాల్లోపే తనపనిని చేసేసింది. 9.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్ అంటే ఇది కదా అని నిరూపించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెడ్‌, అభిషేక్‌.. లఖ్‌నవూ బౌలర్లను ఉరికిపించి ఉతికి ఆరేశాడు.

లక్నో సూపర్ జెయింట్‌పై ట్రావిస్ హెడ్ పేలుడు బ్యాటింగ్ చేశాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అతను IPL యొక్క పవర్‌ప్లేలో యాభై ప్లస్ నాలుగు సార్లు స్కోర్ చేసాడు మరియు అతను IPL 2024లో మాత్రమే ఇవన్నీ చేశాడు. ఐపీఎల్ పవర్‌ప్లేలో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోరు సాధించిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు. అతను ఇలా 6 సార్లు చేసాడు. ఇప్పుడు హెడ్ మాత్రమే వార్నర్ వెనుక ఉన్నాడు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో రెండు రోజులు మద్యం షాపులు బంద్

Latest News

More Articles