Thursday, May 9, 2024

కొత్తకారు కొనేవారికి గుడ్ న్యూస్..తక్కువ ధరకే హైబ్రిడ్ కారు..!

spot_img

కారు కొనాలనే కోరిక చాలా మందికి ఉంటుంద. కానీ అధిక ధరల వల్ల మధ్యతరగతి ప్రజలు కొనలేకపోతున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది మారుతీ. దేశంలో అందుబాటు ధరకే హైబ్రిడ్ కార్లను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుసమాచారం. దేశీయకార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కంపెనీ నుంచి ఈ కారు త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. దీనికోసం జపాన్ కు చెందిన సుజుకీ కంపెనీ చిన్నపాటి హైబ్రిడ్ కార్ల తయారీపై ఫోకస్ పెట్టింది. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కార్ల కంటే ఎక్కువ మైలేజీతో ఈ కార్లు రానున్నాయని తెలిపారు. మారుతీ సుజుకీ త్రైమాసిక ఫలితాలు వెల్లడైన అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

కాగా టయోటా హైబ్రిడ్ కార్లలో వినియోగిస్తున్న టెక్నాలజీ ఖర్చుతో కూడుకున్నదని ఆర్సీ భార్గవ తెలిపారు. దీనివల్ల హైబ్రిడ్ కార్ల ధరలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. దీంతో తక్కువ ఖర్చుతో నడిచే హైబ్రిడ్ కారులను తీసుకురావాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పారు. దీనికోసం చిన్నపాటి హైబ్రిడ్ కార్ల టెక్నాలజీపై సుజుకీ పనిచేస్తుందన్నారు. హైబ్రిడ్ కార్లపై జీఎస్టీని తగ్గించాలని కోరారు. అప్పుడు అందుబాటు ధరలో మెరుగైన హైబ్రిడ్ కార్లను దేశీయ రోడ్లపై చూడటం సాధ్యపడుతుందన్నారు.

దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పై 5శాతం జీఎస్టీ విధిస్తుండగా..హైబ్రిడ్ కార్లపై 43శాతం ట్యాక్స్ పడుతోంది. హైబ్రిడ్ కార్లపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్రుష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. హైబ్రిడ్ వాహనాలపై 5శాతం ఫ్లెక్స్ ఇంజిన్ వాహనాలపై 12శాతానికి తగ్గించాలని ఆయన కోరారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం. పన్ను తగ్గించడం ద్వారానే హైబ్రిడ్ విస్తరణ రుణపడి ఉంటుందని భార్గవ తెలిపారు. ఎలక్షన్స్ తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు మారుతీ సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ కారును ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనే తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: మ‌ల్లారెడ్డి రాజ‌కీయం అనుభవంతో ఈట‌ల‌పై ఆ కామెంట్స్ చేశారు

Latest News

More Articles