Thursday, May 9, 2024

కేటీఆర్‌పై వ్యాఖ్యలు: మంత్రి కొండా సురేఖకు ఎన్నికల సంఘం హెచ్చరిక

spot_img

రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక జారీ చేసింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఈ నెల 1వ తేదీన చేసిన వ్యాఖ్యల విషయంలో ఈసీ ఆమెను హెచ్చరించింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. ఆరోపణలు చేసే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని,  స్టార్ క్యాంపెయినర్ గా, మంత్రిగా మరింత బాధ్యతగా ఉండాలని హితవు పలికింది. కేటీఆర్‌పై సురేఖ చేసిన వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.

ఈ నెల 1న వరంగల్ మీడియా సమావేశంలో కొండా సురేఖ మాట్లాడుతూ… ఫోన్ ట్యాపింగ్‌తో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారని కొండా సురేఖ ఆరోపించారు. ఎంతోమంది అధికారులను బలి చేశారని, వారు ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశారన్నారు. ఇప్పటికే మీ సోదరి కవిత శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌పై కొండా సురేఖ వ్యాఖ్యలపై కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్ ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: మా ఊళ్లో ప్రచారం వద్దు.. కాంగ్రెస్‌ ఫ్లెక్సీని చింపేసిన చిలుకమ్మతండా వాసులు

Latest News

More Articles