Wednesday, May 8, 2024

మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఏరీస్ గా 60 ఏళ్ల భామ

spot_img

అందాల పోటీల్లో కేవలం యవ్వనంలో ఉండే వారే పాల్గొనాలనే మూస ధోరణిని ఓ పెద్దావిడ బ్రేక్ చేసింది. అర్జెంటీనాకు చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా మారిసా రోడ్రీగజ్ మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఏరీస్ టైటిల్ గెలుచుకొని అందరినీ ఆశ్చర్యపరించింది. తద్వారా తొలిసారి ఈ వయసులో బ్యూటీ క్వీన్ గా నిలిచి చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.

అర్జెంటీనాలోని బ్యూనోస్ ఏరీస్ ప్రావిన్సు రాజధాని లా ప్లాటాకు చెందిన రోడ్రీగజ్ అందగత్తే కాదు.. ఓ లాయర్, జర్నలిస్టు కూడా. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నమాట. అందానికి ఉన్న సంప్రదాయ ప్రమాణాలు, వయసు అడ్డంకులను చెరిపేస్తూ ఆమె ఈ టైటిల్ ను గెలుచుకుంది. ఆమె నవ్వు, సొగసు, సౌందర్యం వీక్షకులతోపాటు న్యాయ నిర్ణేతలను కట్టిపడేసింది. ఈ వయసులో అందాల కిరీటం సాధించిన తొలి మహిళగా రోడ్రీగజ్ నిలిచింది. ఇక వచ్చే నెల జరగనున్న మిస్ యూనివర్స్ అర్జెంటీనా–2024 అందాల పోటీల్లో బ్యూనోస్ ఏరీస్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు రోడ్రీగజ్ సిద్ధమవుతోంది. ఈ పోటీలో ఆమె గెలిస్తే విశ్వ వేదికపై జరిగే మిస్ యూనివర్స్ వరల్డ్ కాంటెస్ట్ లో ఆమె అర్జెంటీనా పతాకాన్ని ఎగరేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న మెక్సికోలో మిస్ యూనివర్స్ పోటీలు జరగనున్నాయి.

అందాల పోటీలకు వయసు పరిమితి నిబంధనను మిస్ యూనివర్స్ సంస్థ గతేడాది తొలగించింది. దీంతో ఈ ఏడాది నుంచి 18 ఏళ్లు దాటిన అతివలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం లభించింది.

ఇది కూడా చదవండి: మా ఊళ్లో ప్రచారం వద్దు.. కాంగ్రెస్‌ ఫ్లెక్సీని చింపేసిన చిలుకమ్మతండా వాసులు

Latest News

More Articles