Sunday, May 19, 2024

తెలంగాణ ప్రజలకు పోలీసు శాఖ హెచ్చరిక..అప్రమత్తంగా ఉండాలంటూ..!

spot_img

ఎండవేడిమితో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా అకాలవర్షం దంచికొడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటిలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎక్కడిక్కడ వరదనీరు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోపక్క ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలుచోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలోనే విద్యుత్ వైర్లు తెగిపడి పలుచోట్ల కరెంట్ కు అంతరాయం ఏర్పడింది.

ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు పోలీసు శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని..పిడుగుల ప్రమాదం ఉన్నందున చెట్ల కింద ఉండటం, ట్రాన్స్ ఫార్మర్ లు విద్యుత్ స్తంభాలు తాకడం చేయరాదని ..శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలని తెలిపింది. అత్యవసర సమయాల్లో #Dial100కు ఫోన్ చేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‎పై మోదీ ఓ రేంజ్ లో కౌంటర్ ఎటాక్..!

Latest News

More Articles