Sunday, May 19, 2024

కాంగ్రెస్‎పై మోదీ ఓ రేంజ్ లో కౌంటర్ ఎటాక్..!

spot_img

లోకసభ ఎన్నికల వేళ కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. 60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, యూపీఏ హయాంలో అన్ని కుంభకోణాలే జరిగాయంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ రాచరిక పాలనకు తెరలేపిందని మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందనే విషయాన్ని ప్రచారస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తోంది. ఈ క్రమంలోనే పోలింగ్ సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ ముస్లింలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన మోదీ..ముస్లింలను వ్యతిరేకించడం బీజేపీ విధానం కాదన్నారు.

నెహ్రూ ప్రధానిగా ఉన్ననాటి నుంచే విపక్షాలు తమపై ముస్లింల విషయంలో బద్నాం చేస్తున్నాయన్నారు. కేవలం వారి ఓట్లను దండుకునేందుకు హస్తం పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందంటూ ఫైర్ అయ్యారు. బీజేపీని ముస్లిం వ్యతిరేకులుగా చిత్రీకరించి కాంగ్రెస్ నేటికీ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇక నుంచి వారి ఆటలు సాగవని..ముస్లింలలో కొందరు వాస్తవాలను తెలుసుకుంటున్నారని మోదీ అన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు ముస్లిం మహిళల్లో ఆనందం చూశామన్నారు. బీజేపీ ఎవరిపై వ్యక్తిగత కక్షచూపలేదన్నారు. ఆ విషయం ఆయుష్మాన్ భారత్, కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రజలకు అర్థమయ్యిందన్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ అబద్దాలను బట్టబయలు చేయడం ఖాయమన్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం..!

Latest News

More Articles