Sunday, May 19, 2024

హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం..!

spot_img

ఉక్కపోతతో సతమతమవుతున్న నగర వాసులకు వరణుడు ఉపశమనం కల్పించాడు. మంగళవారం సాయంత్రం 4గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా వడగండ్ల వర్షం కురుస్తోంది. కోంపల్లి, సుచిత్ర, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల, కొండాపూర్ లో వర్షం కురుస్తోంది. మియాపూర్ లో వడగండ్ల వాన పడింది. ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అలాగే సికింద్రాబాద్‌, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, ప్యారడైజ్‌, మారేడ్‌పల్లి, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, పేట్‌బషీరాబాద్‌ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని పలుచోట్ల వర్షం కురిసింది.ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. మేడ్చల్‌, కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మ, చందానగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటు పలుచోట్ల వాన పడింది. అదే సమయంలో హైదరాబాద్‌వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం వాతావరణం చల్లబడింది. హైదరాబాద్‌లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. సాయంత్రం, రాత్రి సమయంలో పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. తేలికపాటి నుంచి మోస్తరు.. ఉరుములు, మెరుపులతో వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఇది కూడా చదవండి: బెయిలిస్తే కేజ్రీవాల్ సీఎం విధులు నిర్వర్తించవద్దు

Latest News

More Articles