Sunday, May 19, 2024

కేరళలో మళ్లీ ‘వెస్ట్‌ నైల్‌’ఫీవర్ కేసులు..ఆ జిల్లాలకు అలర్ట్..!

spot_img

కేరళలో మళ్లీ వెస్ట్ నైల్ ఫీవర్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని త్రిసూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ కేసులు నమోదు అయ్యాయాని కేరళ ప్రభుత్వం మంగళవారం తెలిపింది. రాష్ట్రంలో వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదు అయ్యాయాని అన్ని జిల్లాలకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు.

క్యూలెక్స్ జాతి దోమల ద్వారా వైరల్ ఫీవర్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దోమలు వ్రుద్ధి చెందే ప్రదేశాలను నాశనం చేయడం ద్వారా వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. జ్వరం లేదా వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని తెలిపారు. వెస్ట్ నైల్ వైరస్ చికిత్స్ కు ఔషదం లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. నివారణ చర్యల్లో భాగంగా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలని, దోమ తెరలను వాడాలని, ఇళ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ నగరంలో ఘోరప్రమాదం..గోడకూలి ఏడుగురు దుర్మరణం.!

Latest News

More Articles