Monday, May 20, 2024

వర్షం మిగిల్చిన విషాదం..నాలాలో కొట్టుకువచ్చిన మృతదేహాలు..!

spot_img

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మంగళవారం కురిసిని భారీ వర్షం విషాదాన్ని నింపింది. మంగళవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నాలాలో పడి ఇద్దరు మరణించారు. శవాలు బేగంపేట వద్దకు నాలాలో కొట్టుకురావడం కలకలం రేపింది. వాటిని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు జీహెచ్ఎంసీ సిబ్బంది డెడ్ బాడీలను బయటకు తీసి పోస్టు మార్టంకోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే నాలాలో కొట్టుకువచ్చిన డెడ్ బాడీలు ఎవరవనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అటు బాచుపల్లిలో మంగళవారం కురిసిన భారీ వర్షం విషాదం నింపింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది. వేసవి సమయంలో కురిసిన ఈ అకాల వర్షానికి హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఘోరప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ గోడకూలింది. దీంతో ఏడుగురు కార్మికులు గోడకింద చిక్కుకుని మరణించారు. ఈ ప్రమాదంలో మరణించినవారంతా ఒడిశా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. మృతులు తిరుపతి (20), శంకర్‌ (22), రాజు (25), ఖుషి (23), రామ్‌ యాదవ్‌ (34), గీత (32), హిమాన్షు (4) గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి బాచుపల్లిలోని మమతా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఓ మహిళతోపాటు నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ నగరంలో ఘోరప్రమాదం..గోడకూలి ఏడుగురు దుర్మరణం.!

Latest News

More Articles