Monday, May 20, 2024

చిక్కుల్లో హర్యానా సర్కార్..ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్..!

spot_img

హర్యానా సర్కార్ చిక్కుల్లో పడింది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో నైబ్ సింగ్ సైనీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి సపోర్టు చేయడం లేదు. ఆ తర్వాత బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఇఫ్పుడు నాయబ్ సింగ్ సైనీ సర్కార్ అధికారంలో కొనసాగే హక్కులేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.

కాగా మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యే గవర్నర్ కు లేఖ రాశారు. తాము లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్టు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్‌ సంగ్వాన్‌, రణ్‌ధీర్‌ గొల్లెన్‌, ధరమ్‌పాల్‌ గొండెర్‌ గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు వారు రోహ్‌తక్‌లో మాజీసీఎం, కాంగ్రెస్‌ నేత భూపిందర్‌ సింగ్‌ హూడా, హర్యానా పీసీసీ అధ్యక్షుడు ఉదయ్‌ భాన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ సర్కార్‌ విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలు తీవ్రమయ్యాయని ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

హర్యానాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ సైనీ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హర్యానాలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి? JJP మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత, 41 మంది బిజెపి ఎమ్మెల్యేలు, 6 స్వతంత్ర ఎమ్మెల్యేలు గోపాల్ కందాతో పాటు సైనీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. అంటే సైనీ ప్రభుత్వానికి 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.అయితే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మనోహర్ లాల్ ఖట్టర్ , మాజీ స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ చౌతాలా బీజేపీ గుర్తుపై లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు . వీరిద్దరూ అసెంబ్లీ సభ్యత్వం నుంచి తప్పుకున్నారు. అంటే 46 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సైనీ ప్రభుత్వం మిగిలిపోయింది. వీరిలో ఇప్పుడు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో సైనీ ప్రభుత్వానికి 43 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది.

హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, రంజిత్ చౌతాలా రాజీనామా చేసిన తర్వాత ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 88కి చేరింది. దీని ప్రకారం మెజారిటీకి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం, అది నెరవేరేలా కనిపించడం లేదు. మరోవైపు, హర్యానాలోని నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోయిందని కాంగ్రెస్ చెబుతోంది.

ఇది కూడా చదవండి: వర్షం మిగిల్చిన విషాదం..నాలాలో కొట్టుకువచ్చిన మృతదేహాలు..!

Latest News

More Articles