Sunday, May 19, 2024

సినీఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ నటి కన్నుమూత.!

spot_img

ప్రముఖ మలయాళ నటి కనకలత కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె..ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో సోమవారం మరణించినట్లు బంధువులు తెలిపారు. డిమెన్షియాతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 2021లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడగా 2022లో వైద్యులు ఎమ్ఆర్ఐ స్కాన్ ద్వారా తనకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. కాగా ఆమె పలు భాషల్లో మొత్తం 360కిపైగా సినిమాల్లో నటించింది.

ఆమె నటించిన ప్రముఖ సినిమాల్లో ప్రియం, కన్నుూతి పొట్టుమతోట్టు, వర్ణపకట్టు, స్పడికం, కిరీడం, చిల్లు వంటి సినిమాలు ఉన్నాయి. ఆమె తొలి చిత్రం ఉనర్తుపాట్టు ఈమూవీతో సినీఇండస్ట్రీలోకి పరిచయం అయ్యింది. అన్యార్, వక్కలతు నారాయణన్ కుట్టి, చిరిక్కుడుక్క, ఆగ్రహారం వంటి సినిమాల్లో ఈమె పాత్రకు మంచి గుర్తింపు లభించింది. చాలా మంది సీనియర్ నటులతో కలిసి పనిచేసింది. కనకలత మరణంతో ఒక్కసారిగా చిత్రపరిశ్రమ విషాదలోకి వెళ్లింది. ప్రముఖనటీనటులు ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కనకలత ఆగస్టు 24, 1960న కొల్లాం జిల్లాలోని ఓచిరాలో జన్మించారు . నటి పరమేశ్వరన్ పిళ్లై, చిన్నమ్మల కుమార్తె. కనక్లత గర్ల్స్ హైస్కూల్ నుండి తన ప్రారంభ విద్యను అభ్యసించింది. నాటకాల ద్వారా నటనను తన అభిరుచిగా మార్చుకుంది. నటి వివిధ భాషల చిత్రాలలో పనిచేసింది.

ఇది కూడా చదవండి: చిక్కుల్లో హర్యానా సర్కార్..ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్..!

Latest News

More Articles