Sunday, May 19, 2024

అస్సాంలో రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు..!!

spot_img

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారు. అయితే, అస్సాంలో పరిపాలనపై రాహుల్ గాంధీ విబేధిస్తున్నారు. గౌహతిలోని ప్రధాన రహదారులపైకి కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులను రాకుండా హైవేపై బారికేడ్లు ఉంచారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇప్పుడు ఈ కేసులో అస్సాం పోలీసులు సుమోటోగా కాగ్నిజెన్స్ తీసుకున్నారు. హింసలో పాల్గొన్నందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర పార్టీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ సెక్షన్ల కింద కేసు నమోదు:
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్విటర్‌ వేదికగా స్పందించారు. హింస, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసులపై కాంగ్రెస్ సభ్యుల దాడులు అనియంత్రిత చర్యల నేపథ్యంలో సెక్షన్ 120(B) 143/147/188/283/353/332/333/427 IPC r/w సెక్షన్ 3 PDPP యాక్ట్ కింద రాహుల్ గాంధీ, కే.సీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతరలపై FIR నమోదు చేసినట్లు వెల్లడించారు. అంతకుముందు, బారికేడ్ బద్దలు కొట్టడానికి ప్రజలను హింసవైపు ప్రేరేపించినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను సీఎం ఆదేశించారు.

ఏం జరిగిందంటే?
గౌహతిలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రాహుల్ గాంధీ బస్సు పైన నిలబడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు బారికేడ్లను తొలగించారని, అయితే మేము చట్టాన్ని ఉల్లంఘించబోమని అన్నారు. మేము బలహీనులమని మీరు అనుకోవద్దని…బారికెడ్లను తోసుకుని ముందుకెళ్లమంటూ రాహుల్ గాంధీ తన కార్యకర్తలు, మద్దతుదారులను సింహాలుగా అభివర్ణించారు. దీంతో రెచ్చిపోయిన కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లేలా రాహుల్ గాంధీ రెచ్చిగొట్టడం తోనే ఇలా జరిగిందని ఆయన కేసు నమోదు చేశారు.

రాహుల్ జనాన్ని రెచ్చగొట్టారు: సీఎం శర్మ
రాహుల్ గాంధీపై ముఖ్యమంత్రి హిమంత శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. వారు సేవకులు, ఏ రాజకుటుంబానికి చెందినవారు కాదు. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్నవారిపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: రామభక్తులకు శుభవార్త. సికింద్రాబాద్ నుంచి అయోధ్యుకు 17 స్పెషల్ ట్రైన్స్..!!

&;

Latest News

More Articles