Sunday, May 12, 2024

కాంగ్రెస్ సీనియర్ నేత కుమార్తెపై కేసు నమోదు

spot_img

ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ కుమార్తె సురన్యాపై కేసు నమోదైంది. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టను ఉద్దేశించి ఆమె గత నెల 20న సోషల్‌ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయోధ్య కార్యక్రమానికి నిరసనగా తాను మూడు రోజుల పాటు ఉపవాసం ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టుపై వివాదం చెలరేగింది. సుప్రీం కోర్టు లాయర్‌, బీజేపీ నేత అజేయ్‌ అగర్వాల్‌ శనివారం ఢిల్లీసైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేయగా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.
ఈ నేపథ్యంలో సురన్యా ఇల్లు ఖాళీ చేయాలని జాంగ్‌పుర్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కోరింది. శాంతి, సామరస్యాలకు భంగం కలిగించే చర్యలు చేపడుతున్నందున తమ కాలనీ నుంచి వెళ్లిపోవాలని కోరుతూ బుధవారం లేఖ రాసింది. దీనికి ఆమె ఫేస్‌బుక్‌లో సమాధానమిస్తూ.. తాము నివసిస్తున్న ఇంటికి ఆ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌తో సంబంధం లేదని తెలిపింది.

ఇది కూడా చదవండి: ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి నైట్ పార్టీలు..!

Latest News

More Articles