Sunday, April 28, 2024

ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి నైట్ పార్టీలు..!

spot_img

సినిమా వాళ్ళతో పార్టీలు, విందులు అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ఎలాంటి విమర్శలు చేసేవాడో అందరికి తెలిసిందే. సినిమా కళాకారులతో వ్యక్తిగత పరిచయాలని కూడా రాజకీయాలకు వాడుకునేవారు ఈ రేవంత్ రెడ్డి. సినిమా నటీనటులతో రాజకీయాల నాయకులకు సంబంధాలను అంటగట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేపించిన నీచ చరిత్ర రేవంత్ రెడ్డికి ఉందంటూ జనాలు అనుకునేది. కట్ చేస్తే ప్రభుత్వంలోకి రేవంత్ రెడ్డి వచ్చారు. మరి ఈయన చేస్తుందేంటీ అంటూ ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలతో అమెరికాలో సభలు పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని బొంద పెడతానంటూ విమర్శలు. ఆంద్ర ప్రదేశ్ మూలాలున్న కుమారి ఆంటీపై ట్వీట్లు. ఇప్పుడు సినిమా హీరోల ఇళ్లల్లో నైట్ పార్టీలు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేస్తున్న టైం పాస్ పనులివి అంటూ విమర్శలు వస్తున్నాయి.

ఒకవైపేమో ఆరు లక్షల ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రోజుకొక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కాంగ్రెస్ లో పట్టించుకునే నాథుడే లేదు. పెన్షన్లు లేక ముసలోళ్ళు, వికలాంగులు నడిరోడ్డుపై ధర్నాలు చేస్తున్నారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధు లేక గోస పడుతున్నారు. బస్సుల్లో మహిళలు కొట్టుకుచస్తున్నారు. GO 46కి వ్యతిరేకంగా తెలంగాణ యువత భారీగా నిరసనలు తెలుపుతుంది. తెలంగాణలో ఏ వర్గం కూడా సంతోషంగా లేక దరిద్రం అనుభవిస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం సినిమా హీరోలతో నైట్ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. సినీ రంగాన్ని హైదరాబాద్ లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అప్పటి మంత్రి కేటీఆర్ కళాకారులతో సంబంధాలు ఏర్పరుచుకుంటే.. వ్యక్తిగతంగా దూషణలు చేసిన ఈ రేవంత్ రెడ్డే ఇప్పుడు విందుల్లో పాల్గొనటం ఏంటంటూ విమర్శలు వస్తున్నాయి. ఓట్లేసిన జనాలేమో ఆత్మహత్యలు చేసుకుంటుంటే..రేవంత్ రెడ్డి మాత్రం సీఎం హోదాలో పార్టీలు, విందులు చేసుకోవటం సమంజసం కాదంటున్నారు జనాలు.

Latest News

More Articles