Friday, May 17, 2024

అబిడ్స్‌ ట్రూప్‌ బజార్‌లో అగ్నిప్రమాదం

spot_img

హైదరాబాద్‌ లోని అబిడ్స్‌ ట్రూప్‌ బజార్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎల్‌ఈడీ లైట్లు విక్రయించే దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటన తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇదే భవనంలో నివసించే సెక్యూరిటీ కుటుంబాన్ని అధికారులు రక్షించారు. ప్రమాదంలో దుకాణంలోని సామగ్రి మొత్తం దగ్ధమైంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Latest News

More Articles