Saturday, May 18, 2024

హైదరాబాద్ పంజాగుట్టలో భారీ అగ్నిప్రమాదం…అపార్ట్ మెంట్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు..!!

spot_img

హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లోని ఓ అపార్ట్ మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్ మెంట్లోని 6వ అంతస్తులో షార్ట్ సర్య్కూట్ కారణంగా ఒక్క సారిగా మంటలు ఎగిసిపడ్డాయి. బిడ్డింగ్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. అందులో నివసిస్తున్న కొంతమంది ప్రాణభయంలో బయటకు వచ్చి అగ్నిమాపక సిబ్బందించి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

మంటల్లో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి కాపాడారు. అక్కడున్న డంబెల్ సాయంతో డోరును బద్దలు కొట్టి ఆ కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చాడు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో ఘోరరోడ్డు ప్రమాదం…ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నలుగురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం..!!

Latest News

More Articles