Sunday, June 23, 2024

ఇసుకలో పాపడ్‌ వేయించిన సైనికుడు..వైరల్ వీడియో.!

spot_img

దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే..మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు ఎండలు మండుతున్నాయి. చాలా చోట్లు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగానే నమోదు అవుతున్నాయి. ఎండలతో జనం హడలెత్తిపోతున్నారు. రాజస్థాన్ లో ఎండల ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పడానికి ఈ వీడియో నిదర్శనం. ఓ బీఎస్ఎఫ్ జవాన్ రాజస్థాన్ లోని బికనీర్ లో ఇసుకపై పాపడ్ ను వేయిస్తూ ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో చూపించాడు.

ప్రతికూల పరిస్థితుల్లోనూ మన దేశ సరిహద్దుల రక్షణలో భారత సైనికులు ఎలా భద్రతలో నిమగ్నమయ్యారో ఈ ఫోటోను చూస్తే తెలిసిపోతుంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ వైపు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు జనం ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తుంటే మరోవైపు దేశ సరిహద్దుల్లో మన సైనికులు భానుడు నిప్పులు కురిపిస్తున్న తట్టికుని పహారా కాస్తున్నారు. వైరల్ అవుతున్న ఫొటో ఖాజువాలా పాక్ సరిహద్దులో ఉంది.

ఇది కూడా చదవండి: పూణె కారు ప్రమాదం కేసు..మైనర్ బెయిల్ రద్దు..!

Latest News

More Articles