Sunday, June 16, 2024

పెళ్లి చేసుకోవడం లేదని ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్స్..

spot_img

పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఉండే సందడి గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ ప్రభాస్ కాంబోలో వస్తున్న హై టెక్నికల్ వాల్యూ సినిమా కల్కి 2898AD. స్టార్ ప్రొడ్యూసర్ కె. అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని రూపొందిస్తుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా బుధవారం రామోజీ ఫిల్మ్ సిటీలో కల్కి 2898ఏD బుజ్జి వర్సెస్ భైరవ పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ కల్కీ మూవీపై ప్రశంసలు కురిపించారు.

ఈ సినిమాలో నటిస్తున్న లెజండరీ యాక్టర్ అమితాబ్, జాతీయ నటుడు కమల్ హాసన్ గురించి ప్రభాస్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశాడు. కల్కీలో కీలకమైన బుజ్జీ అనే ఓ కారును కూడా ఈవెంట్ లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ పెద్దమ్మ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. కమల్, అమితాబ్ వంటి టాప్ హీరోలతో కలిసి నటించడం తనకు ఎంతో గర్వంగా ఉందని ప్రభాస్ అన్నారు. అంతేకాదు నాగ్ అశ్విన్ దర్శకత్వప్రతిభ, వైజయంత బ్యానర్ గొప్పతనం గురించి మాట్లాడారు. ఇక లాస్ట్ లో తన పెళ్లి గురించి సంబంధించిన వార్తలపై కూడా ప్రభాస్ మాట్లాడాడు. తనపై తానే సెటైర్లు వేసుకుని అందర్నీ ఉత్సాహపరిచాడు.

Latest News

More Articles