Friday, May 17, 2024

ఎల్బీ నగర్‌ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల చిన్నారి మృతి

spot_img

హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌ లో విషాదం జరిగింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు పక్కన కారు ఆపిన డ్రైవర్.. సడెన్‌గా డోర్ తీయటంతో బైక్ వెళ్తున్న రెండేళ్ల పాప చనిపోయింది.

శశిరేఖ, సయ్యద్ దంపతులకు ధనలక్ష్మి అనే రెండేళ్ల చిన్నారి ఉంది. సయ్యద్ దంపతులు తమ పాపన తీసుకొని బైక్‌పై వెళ్తుండగా.. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి సమీపంలోకి రాగానే.. ఓ వ్యక్తి రోడ్డు పక్కన కారు ఆపాడు. ఆపై వెనుక నుంచి ఎవరు వస్తున్నారో.. లేదో చూసుకోకుండా సడెన్‌గా కారు డోర్ తీశాడు. అంతే.. వెనుక నుంచి బైక్ వస్తున్న సయ్యద్ బైక్‌ కు కారు డోరు తగిలింది. ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు కిందపడిపోగా.. ధనలక్ష్మి అక్కడిక్కడే మృతి చెందింది. సయ్యద్, శశిరేఖ దంపతులకు గాయాలయ్యాయి. ఘటన తర్వాత కారు డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest News

More Articles